ప్రకాశం: పీఎం అవార్డ్స్ కోసం ప్రతిపాదనల వివరాలను వెబ్ సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. 2022 ఏప్రిల్ నుండి 2024 డిసెంబర్ నెల ఆఖరు వరకు జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు.