కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈనెల 23న అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ మిషన్ – రాజమండ్రి అధ్యక్షులు స్వామి పరిజ్నేయానందజీ మహారాజ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకుంటారు.