ADB: ఆదివాసులకు ఆరాధ్య దైవం నాగోబా కొలువై ఉన్న కేస్లాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రూ.13 కోట్లు ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సచివాలయంలో సీఎస్తో సమావేశమై పలు అంశాలను చర్చించారు. తాము విన్నవించిన సమస్యలను పరిష్కరించాలన్నారు.