NRML: నిర్మల్-బైంసా జాతీయ రహదారిపై ఉన్న దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి బస్సుల కొరకు వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తాత్కాలిక ప్రయాణ ప్రాంగణం ఏర్పాటుచేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని బుధవారం పలువురు కోరారు.