AKP: బీహార్ రాష్ట్రంలోని ప్రసిద్ధ బోధ్ గయా ప్రాంతాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహాబోధి ఆలయ ప్రాంగణం బోధి వృక్ష వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోనే బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి పద్మావతి పాల్గొన్నారు.