గద్వాల: జిల్లా కేంద్రంలోని 24,27, 36 వార్డులకు సంబంధించిన వార్డుల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.