KRNL: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు నగరంలో నిరసన పాదయాత్ర జరగనుంది. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై పాత బస్టాండ్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని నేతలు తెలిపారు.