SKLM: ప్రతి పోలీసు అధికారి అంకితభావంతో విధులు నిర్వర్తించి 2025 ఏడాదిలో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, మహిళలు చిన్నారులపై జరిగేనేరాలు, సైబర్ నేరాలు, గ్రేవ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు, తదితర కేసులపై సమీక్షించారు.