KMM: ఖమ్మం కలెక్టరేట్ నుండి శనివారం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా “ఎవ్రీ చైల్డ్ రీడ్స్” కార్యక్రమంపై జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించి, కార్యక్రమ అమలుపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నామని, పాఠశాల సమయాల్లో మాత్రమే ఈ కార్యక్రమం అమలు చేసేలా డిజైన్ చేయడం జరిగిందన్నారు.