NLG: జిల్లా పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, రాఘవేంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు సోమగాని శంకర్ గౌడ్ సతీమణి సోమగాని మంజుల మృతిచెందగా.. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శంకర్ గౌడ్ ను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.