NGKL: పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో బోనాల పండగను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ హాజరై బొడ్రాయి, కోటమైసమ్మ, పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ మహిళలు మొలకల బోనాలు, బోనాలు ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.