WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ డివిజన్ ఏఎస్పీగా ఎన్. శుభం ప్రకాష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుభం 2024 సంవత్సరంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆరు నెలల పాటు ట్రైనీ ఐపిఎస్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వరంగల్ ఏసీపీగా పనిచేస్తున్న నందిరాం నాయక్ డీజీపీ కార్యాలయంకు బదిలీ అయ్యారు.