MLG: పేద విద్యార్థులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది. జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో మొత్తం నాలుగు జిల్లాల్లో కేవీఎస్ ఏర్పాటుకు నిర్ణయించగా MLG జిల్లా కూడా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పేదవర్గాలకు ఉన్నత విద్యాభ్యాసం చేరువ కానుందని విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.