A Youth Suicide Because Of Finance Company Harassment
Finance Company Harassment: ఫైనాన్స్ కంపెనీల (Finance Company) ఆగడాలు మితిమీరుతున్నాయి. లోన్ (loan) తీసుకోవాలని అడుగుతారు. టెంప్ట్ అయి తీసుకుంటే అంతే సంగతులు. నెలనెల ఈఎంఐ (emi) సరిగా కట్టాలి.. లేదంటే వేధింపులు తప్పవు. లోన్ తీసుకున్న వారికే కాకుండా.. వారి ఫ్రెండ్స్‌కు కాల్స్ వస్తుంటాయి. లోన్ కట్టాలని బూతులు కూడా తిడతారు. సున్నిత మనస్తత్వం కలిగిన వారు అయితే క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటారు.
ఫైనాన్స్‌లో బైక్
కుత్బుల్లాపూర్ పరిధిలో ఉండే లక్ష్మణ్ (laxman) అనే యువకుడు కూలీ పనులు చేస్తుంటాడు. టూ వీలర్ (two wheeler) తీసుకోవాలని అనుకున్నాడు. తన వద్ద కొంత మొత్తం నగదు ఉండగా.. మిగతా ఫైనాన్స్ తీసుకున్నాడు. పనులు లేక గత 3 నెలల నుంచి ఫైనాన్స్ కట్టడం వీలు పడలేదు. ఇంకేముంది ఫైనాన్స్ కంపెనీ (Finance Company) నుంచి ఫోన్ల మోత మోగుతుంది. ఈఎంఐ ఎప్పుడూ కడతావని ఒక రేంజ్లో వేధించారు. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
సూసైడ్
వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మైసమ్మగూడ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. మృతదేహాం వెలికితీసి.. పోస్టుమార్టం కోసం తరలించారు. లక్ష్మణ్ (laxman) మృతితో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఆన్ లైన్ మనీ యాప్స్ ఇలా..
ఈ ఒక్కటే కాదు.. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఫైనాన్స్ కంపెనీల (Finance Company) వేధింపులు భరించలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలోనే ఫైనాన్స్ కంపెనీల (Finance Company) గురించి చర్చ జరుగుతుంది. తర్వాత దానిని పట్టించుకునే వారే ఉండరు. ఆన్ లైన్ మనీ యాప్స్ (online money app) కూడా అంతే.. లోన్ (loan) తీసుకుని కట్టలేదంటే అంతే సంగతులు. ఇక వీళ్లు అయితే సోషల్ మీడియాలో (social media) కూడా సమాచారం పెడతామని బెదిరిస్తారు. వడ్డీ కూడా ఎక్కువగా వేస్తుంటారు. ఆన్ లైన్ మనీ యాప్స్ వేధింపుల వల్ల చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు.