ADB: పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను ఆయన లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.