ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.