నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన జీపీ ఎన్నికల నామినేషన్లపై వచ్చిన అప్పీళ్లను కలెక్టర్ త్రిపాఠి మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 9 మండలాలలో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్ల పై 19 అప్పీళ్లు రాగా.. నిబంధనలను పరిశీలించి ఆర్డీవో 4 అప్పీళ్లను ఆమోదించి జాబితా రూపొందించారు.