NGKL: కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ పంచాయితీ తాండలో ఆదివారం షార్ట్ సర్క్యూట్ గుడిసె దగ్దమైంది. రాత్లవత్ సీత్యా తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా గుడిసెలో నుంచి పొగలు రావడాన్నీ గమనించిన తండావాసులు నీళ్ళు చల్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కల్వకుర్తి నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ సిబ్బంది వారికి సహాయం అందించారు. గుడిసెలో ధాన్యం,నగదు కాలిపోయాయి.