WGL: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజల నుంచి 136 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.