MDK: ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం మన మెదక్. జిల్లాలో వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, 100 ఏళ్ల సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చరిత్ర పరిశోధకుడు సంతోశ్ ఆవేదన వ్యక్తం చేశారు.నేడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం.