SRPT: హోంగార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ సిబ్బందికి ఉమెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్ అందజేసి మాట్లాడారు. హోంగార్డ్స్ పోలీస్ శాఖలో అంతర్భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని తెలిపారు.