MNCL: జన్నారం మండలానికి యూరియా బస్తాలు వచ్చాయని వ్యవసాయ అధికారి సంగీత, పోన్కల్ పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య వెల్లడించారు. మండలంలోని రైతుల అవసరాల నిమిత్తం ప్రభుత్వం 36 టన్నుల యూరియా బస్తాలను పంపించిందని వారు తెలిపారు. ఇందులో పోన్కల్ పీఏసీఎస్, కలమడుగు, దేవుని గూడెం రైతు వేదికల వద్దకు 12 టన్నుల చొప్పున యూరియా బస్తాలను పంపించామని తెలిపారు.