SRPT: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ నాతల రాంరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కులో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.