SRCL: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలే లక్ష్యం అని సిరిసిల్ల డివిజన్ విద్యుత్ శాఖ DE అంజయ్య అన్నారు. ముస్తాబాద్ సెక్షన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ ఉద్యోగులు , ఓ&ఎం సిబ్బందితో వేసవి కార్యాచరణ, వ్యవసాయ సర్వీసుల మంజూరు, సమావేశం నిర్వహించారు. DE అంజయ్య మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందిస్తామన్నారు.