NLG: SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నల్గొండ, సూర్యాపేట, భువనగిరికి చెందిన నిరుద్యోగ గ్రామీణ యువతులకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రఘుపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నల్గొండలోని రామ్ నగర్ ఎస్బీ ఆరెసెట్కు దరఖాస్తులను పంపాలని, పూర్తి వివరాలకు 97010 09265 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.