ASF: సావిత్రి బాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి మహిళా ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు-2026 కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ వెంకటేష్ నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లాస్థాయి మహిళ ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేసి వారిని సత్కరించారు.