KMM: దసరా సెలవుల్లో పిల్లలతో సహా కుటుంబాలు స్వగ్రామాలు లేదా పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరనున్న నేపథ్యాన. కష్టపడి సంపాదించిన నగదు, ఆభరణాలు దొంగల పాలుకాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. పోలీసు శాఖ పరంగా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేశామని వెల్లడించారు.