ADB: గుడిహత్నూరు మండలంలోని ఉమ్రీ గ్రామ సమీపంలో గల రామాలయ పూజారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు ఆధార్ కార్డును తీసుకొని ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఆయనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.