HYDలోని చంచల్గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు, కాలక్రమంలో ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు పరిమితమైంది.