KMM: ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖిల్లా రోప్ వే అభివృద్ధికి ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి జీఓ విడుదల చేశారు. వెలుగుమట్ల పార్కు అభివృద్ధి, నిర్వహణకు రూ.3 కోట్లు, ఖిల్లా రోప్ వే, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.