HYD: ఖైరతాబాద్ పరిధిలోని లక్డీకాపూల్ వద్ద ఈరోజు పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు.