SDPT: ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న మేస్త్రీ నుంచి డబ్బులు డిమాండ్ చేసిన సిద్దిపేట రూరల్ మండల హౌసింగ్ ఏఈ వెంకన్నను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కే. హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న మేస్త్రీ చింతల వెంకటయ్యను ఏఈ డబ్బులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ జరిపించిన కలెక్టర్ సదరు ఏఈని సస్పెండ్ చేశారు.