KNR: కరీంనగర్ నగర శివారులోని డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని వరసిద్ధి నగర్ కాలనీవాసుల ధర్నా చేశారు. డంపింగ్ యార్డ్ లోకి చెత్త వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. డంపింగ్ యార్డ్లో మంటలతో పొగ పక్క కాలనీవాసులను ఇబ్బంది పెడుతుందని, జబ్బుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు.