సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గ్రూపుల గోలను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్గ పోరు కాంగ్రెస్కు నష్టం, బీఆర్ఎస్కు లాభమని హెచ్చరించారు. హరీష్ రావు పదవిలో మంత్రిగా ఉండే నిధులన్నీ సిద్దిపేటకు ఇచ్చారని దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు.