JGL: అక్టోబర్ 31 వరకు జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ప్రజల భద్రతకు ముప్పుగా ఉండే కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.