ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో వంజరి సంఘం నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దసరా పండుగను పురస్కరించుకొని ఈనెల 28న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న దసరా మేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ముండే సంజీవ్, మాధవ్, సంబు, రాంకిషన్, పండరి తదితరులున్నారు.