NZB: ఆలూర్ మండల కేంద్రము మల్లన్న గుడిలో శనివారం కండే రాయుడు మల్లయ్య స్వామి కళ్యాణం శుక్రవారం ప్రారంభమయింది. ఈ సందర్భంగా స్వామి వారికి వీడీసీ ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు నిర్వహించి, పుట్టమన్ను గుడికి తీసుకెళ్లారు. గుడి ఆవరణలో పట్నం వేశారు. ఈ రోజు సాయంత్రం మల్లయ్య కళ్యాణం నిర్వహణ, నాగవెల్లి, సేవ కార్యక్రమాలు జరుగుతాయని ఆలూర్ VDC సభ్యులు పేర్కొన్నారు.