NLG: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు, చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులోని పాటిమీద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చుంచు శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు కురేళ్ళ శ్రీనివాస్, జయరాపు రామకృష్ణ, గంజి గోవర్ధన్, బొడిగె అశోక్ పాల్గొన్నారు.