WGL: వరంగల్ పోలీసులు CEIR పోర్టల్ ద్వారా రూ.6.80లక్షల విలువైన 32 మిస్సింగ్, ఫోన్లను విజయవంతంగా ట్రేస్ చేసి రికవరీ చేశారు. ఏఎస్పీ శుభం ప్రకాష్, మట్టెవాడ సీఐ కరుణాకర్ చురుకైన పర్యవేక్షణలో కానిస్టేబుల్ మాచర్ల సుమన్ CEIR సిస్టమ్‌ను సమర్థవంతంగా ఉపయోగించి మిస్సింగ్, దొంగిలించిన ఫోన్లను గుర్తించి ట్రేస్ చేశారు. సదరు ఫోన్లను బాధితులకు శుక్రవారం పోలీసులు అందజేశారు.