HYD: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నామినేషన్ల ప్రక్రియ ఐదో రోజుకు చేరుకుంది. నిన్నటివరకు మొత్తం 46 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన నామినేషన్ను సమర్పించారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.