KMM: గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను బైండోవర్ చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు అన్నారు. బోనకల్లు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేసిన సర్పంచ్, వార్డ్ సభ్యులతో శుక్రవారం బోనకల్లులో సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.