NLG: చిట్యాల మండలం వెలిమినేడు GP ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న HM అరుణపై చర్యలు తీసుకోవాలని SFI,DYFI నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన నీటిని అందించేందుకు నాతి కిరణ్ గౌడ్ అనే దాత అందజేసిన వాటర్ ఫిల్టర్‌ను నిర్లక్ష్యంగా బయటపడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యార్థి, యువజన సంఘం నాయకులకు ఆమె నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పేర్కొన్నారు.