WGL: సంగెం మండలం కుంటపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సువర్ణకు మద్దతు తెలుపుతూ గ్రామం నుంచి సుమారు 50 మంది మహిళలు, సంగెం సొసైటీ డైరెక్టర్ గోపతి రాజకుమార్, మాజీ ఉప సర్పంచ్ గోపతి సారంగంలతో పాటు పలువురు బీఆర్ఎస్కు చేరారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం వారికి పార్టీ కండువాకప్పి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.