SRD: విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించాలని చెప్పారు. మరొకరి మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు.