SDPT: కానిస్టేబుల్ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం ఘటన సిద్దిపేటలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. 17 బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ.. భార్య ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం బాలకృష్ణ ఉరేసుకోని చనిపోయారు. భార్య, ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.