NLG: న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. కుటుంబ సమేతంగా ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.