NRPT: మక్తల్ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మండలం హిందూపూర్ వద్ద రహదారిపై బుధవారం బూడిద టిప్పర్ కల్వర్టును ఢీకొట్టడంతో ప్రయాణానికి ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఓవర్ స్పీడ్, మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.