JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అకౌంటెంట్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ మాదాడి సులోచన తెలిపారు. కామర్స్‌లో డిగ్రీ లేదా బీకాం కంప్యూటర్స్ విద్యార్హత కలిగి ఉన్న మహిళ అభ్యర్థుల నుంచి ఈ నెల 12 లోగా దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.