NRML: ఇంటి పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ, వాణిజ్య పన్ను వసూలు తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పన్నుల వసూలులో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.