NRML: బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, సైబర్ క్రైమ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాలపై వారికి అదనపు కలెక్టర్ అవగాహన కల్పించారు. విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని వారికి సూచించారు.